: ప్రకాశం జిల్లాలో తవ్వకాల్లో బయటపడ్డ చోళుల కల్యాణ మండపం
దాదాపు 700 ఏళ్ల నాటి అత్యంత ప్రాచీన కల్యాణ మండపం ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొణిదెన గ్రామంలో బయటపడింది. ఈ గ్రామంలో భవానీ సమేత శంకరుడు, వేణుగోపాల స్వామి ఆలయాలు ఒకే ప్రాంతంలో ఉన్నాయి. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాలు పాడుకాగా, అభివృద్ధి నిమిత్తం ఇటీవల పురావస్తు శాఖ నిధులు కేటాయించింది. దీంతో ఆలయ నిర్మాణాల కోసం తవ్వకాలు చేపట్టగా, ఓ వంటశాల, కల్యాణ మండపం తదితరాలు బయట పడ్డాయి. వీటిని చోళ రాజులు నిర్మించారని వెల్లడించిన అధికారులు, పురాతన సంపదను భవిష్యత్ తరాలకు అందించేలా, వీటిని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.