: రేపిస్టుకి తనే శిక్ష విధించిన బాధితురాలు!
ఆమె మామూలు మహిళ కాదు. అందుకే, తనపై అత్యాచారానికి ఒడిగట్టిన రేపిస్టుకి తనే శిక్ష విధించింది. ఈ ఘటన జార్ఖండ్ లోని రాంచీలో చోటుచేసుకుంది. ఓ మహిళ ఇళ్లల్లో పని చేసుకుంటూ హౌసింగ్ సోసైటీలో నివసిస్తోంది. బుధవారం తెల్లవారు జామున ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడిన మనోజ్ కుమార్ (24) ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో, అతనిని అడ్డుకునేందుకు ఆమె చేతికందిన సుత్తితో కొట్టింది. దీంతో అతను పక్కకి పడిపోవడంతో తనపై దారుణానికి అతని ముఖంపై కసితీరా సుత్తితో కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడికే మృతి చెందాడు. మరునాటి ఉదయం మృతదేహాన్ని అలాగే ఇంట్లోనే ఉంచి మామూలుగా పనిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఘటన గురించి తీవ్రంగా ఆలోచించిన ఆమె, అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహం స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపి, ఆమెను రిమాండ్ కు తరలించారు.