: మరోసారి గొప్పతనం చాటుకున్న సమంత...చెన్నై బాధితులకు 30 లక్షల విరాళం
ప్రముఖ సినీ నటి సమంత మరోసారి తన గొప్పతనం చాటుకుంది. ప్రత్యూష ఫౌండేషన్ నెలకొల్పి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టి మంచి మనసు చాటుకున్న సమంత, వరదల బారినపడి కోలుకుంటున్న చెన్నైకి విరాళం ప్రకటించింది. వైద్య అవసరాలకు 30 లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్టు తెలిపింది. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తాన్ని అందజేస్తున్నామని సమంత తెలిపింది. దీనిపై ప్రముఖ నటి, తమిళనాడు కాంగ్రెస్ నేత ఖుష్బూ ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించింది. 30 లక్షల రూపాయలు ప్రకటించడం గొప్ప విషయమని ఖుష్బూ అభిప్రాయపడింది. ఎంతో మంది స్టార్ హీరోల కంటే సమంత గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆమెను ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నారు.