: తీర్పు నచ్చలేదట... జడ్జి ముఖం మీద కొట్టాడు!
తీర్పు తనకు నచ్చలేదని పోలీసులు అడ్డుకుంటున్నా ఓ వ్యక్తి న్యాయమూర్తిపై దాడికి దిగిన ఘటన ఐర్లాండ్ లో చోటుచేసుకుంది. డబ్లిన్ లోని టెంపుల్ బార్ లోని న్యాయస్థానంలో జస్టిస్ మిరియమ్ వాల్స్ అనే మహిళా న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు వచ్చిన వ్యక్తి జడ్జి తీర్పు సరికాదంటూ ఆమెపై దాడికి దిగాడు. అందరూ చూస్తుండగానే ఆమె వద్దకెళ్లి ఆమె ముఖం మీద బలంగా కొట్టాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వాల్ష్ ను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. న్యాయమూర్తిపై దాడిని ఖండించిన బార్ అసోసియేషన్, నిందితుడికి కఠిన శిక్ష విధించి, భవిష్యత్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకోకుండా చూడాలని కోరింది.