: గుంటూరులో సందడి చేసిన అఖిల్, సమంత


ప్రముఖ సినీ నటులు అఖిల్, సమంత గుంటూరులో సందడి చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ వస్త్ర దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న వీరిద్దరూ గుంటూరు వెళ్లారు. వారి రాక గురించి ముందుగానే తెలిసిన అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. షాపింగ్ మాల్ లో వస్త్రశ్రేణుల గురించి అభిమానులతో ముచ్చటించారు. సినిమాలు, ఇతర అంశాల గురించి మాట్లాడి సందడి చేశారు. దీంతో తమ అభిమాన సినీ నటులను చూసేందుకు యువత ఉత్సాహం చూపడంతో గుంటూరులో సందడి నెలకొంది.

  • Loading...

More Telugu News