: సోమవారం విజయవాడకు కేసీఆర్


అయుత చండీయాగంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం విజయవాడ వెళ్లనున్నారు. దీంతో సోమవారం చంద్రబాబును అయుత చండీయాగంలో పాల్గొనాలని కేసీఆర్ స్వయంగా ఆహ్వానించనున్నారు. అలాగే కేసీఆర్ బెజవాడ కనకదుర్గను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్ రెండో సారి విజయవాడ వెళ్తున్నారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా కేసీఆర్ విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, కేసీఆర్ పిలిస్తే వెళ్లడానికి సిద్ధమని బాబు సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News