: చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరిన తెలంగాణ సీఎంవో


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలిసేందుకు టీఎస్ సీఎంవో అపాయింట్ మెంట్ కోరారు. తన ఫాం హౌస్ లో అయుత చండీయాగం నిర్వహించనున్న నేపథ్యంలో చంద్రబాబును స్వయంగా కేసీఆర్ ఆహ్వానించనున్నారు. దీంతో ముందుగా బాబు అపాయింట్ మెంట్ తీసుకునేందుకు టీఎస్ సీఎంవో ప్రయత్నించారు. దీనిపై ఏపీ సీఎంవో స్పందించాల్సి ఉంది. కాగా, కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులను అయుత చండీయాగానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News