: ప్రముఖ రైతు నేత శరద్ జోషి కన్నుమూత


మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రైతు నేత శరద్ జోషి పుణెలో కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. రైతుల పక్షాన పోరాడేందుకు 1979లో షెట్కారీ సంఘటన్ పేరుతో ఆయన ఓ సంస్థను స్ధాపించారు. అనేక రైతు ఉద్యమాలు చేశారు. 1980లో ఉల్లి మద్దతు ధర కోసం జోషి జరిపిన ఉద్యమం దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. స్వతంత్ర భారత్ పక్ష్ పార్టీని కూడా స్థాపించారు. అనేక పత్రికలకు కథనాలు రాశారు. 2004 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. జోషికి ఇద్దరు కుమార్తెలున్నారు. ఆయన మరణం పట్ల ఆయా పార్టీల నేతలు, రైతులు సంతాపం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News