: ప్రజలకు మాత్రమే మేం జవాబుదారి... ప్రతిపక్షాలకు కాదు: పద్మ దేవేందర్ రెడ్డి


ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులు కావడం వల్లే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నారని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు మెదక్ వెళ్లిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎమ్మెల్సీ ఏకగ్రీవం కావడంతో విపక్షాలకు చెందిన నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. ఇది తగదని సూచించారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. తాము ప్రజలకు మాత్రమే జవాబుదారి అని... ప్రతిపక్షాలకు కాదని అన్నారు.

  • Loading...

More Telugu News