: అద్భుతమైన ఐక్యూతో సత్తా చాటిన భారత సంతతి బాలుడు


బ్రిటన్ లో నిర్వహించిన ఐక్యూ టెస్టులో భారత సంతతి బాలుడు అద్వితీయ ప్రతిభతో సత్తా చాటారు. బ్రిటన్ లో ప్రఖ్యాత మెన్సా సంస్థ ఐక్యూ టెస్టు నిర్వహించింది. కాటెల్ 3బీ పేపర్ ను 162 మార్కులకు నిర్వహించగా, అందులో 12 ఏళ్ల భారత సంతతి బాలుడు వెంకట సత్యశ్రీ రోహన్ 161 మార్కులు సాధించి సత్తాచాటాడు. దీంతో ప్రతిష్ఠాత్మకమైన మెన్సా సొసైటీలో అతనికి సభ్యత్వమిచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రోహన్ కుటుంబం ఎనిమిదేళ్ల క్రితం బ్రిటన్ లో స్థిరపడింది. రోహన్ తండ్రి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి గణిత శాస్త్రంపై మక్కువ ఎక్కువని, ఆ మక్కువే ఈ రోజు మెన్సా సంస్థలో సభ్యత్వం కలిగేలా చేసిందని రోహన్ తండ్రి విష్ణు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News