: సింగపూర్ తో ఒప్పందాలు బయటపెట్టాలి: కాంగ్రెస్
తెలుగుదేశం పార్టీ పాలన పారదర్శకంగా లేదని కాంగ్రెస్ నేతలు సి.రామచంద్రయ్య, శైలజానాథ్ లు విమర్శించారు. వందలాది జీవోలు రహస్యంగా జారీ చేస్తున్నారని... గుట్టుచప్పుడు కాకుండా జీవోలను జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. రహస్య జీవోలన్నింటినీ అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. సింగపూర్ తో ఏపీ ప్రభుత్వం ఏమైనా ఒప్పందాలు చేసుకొని ఉంటే వాటిని కూడా బయటపెట్టాలని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కావాల్సిన రూ. 27 వేల కోట్లను ఎలా సేకరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.