: కేసీఆర్ కు కొనే చరిత్రే కాదు... అమ్ముడుపోయే చరిత్రా ఉంది: ఎర్రబెల్లి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. రాజకీయ నేతలను సంతలో పశువులను కొంటున్నట్టు కొంటున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు కొనే చరిత్రే కాకుండా, అమ్ముడుపోయే చరిత్ర కూడా ఉందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్ అభ్యర్థులను కేసీఆర్ కొనేశారని ఆరోపించారు. జరిగిన పరిణామాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పాలనా పగ్గాలు చేపట్టి 18 నెలలైనా కేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. మరోవైపు, టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి విజయరామారావు పార్టీలోనే ఉంటారని చెప్పారు.