: నకిలీ పాస్ పోర్టులు తయారు చేస్తున్న ఐఎస్ఐఎస్


ఐఎస్ఐఎస్ గురించి పలు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సంస్థ సోషల్ మీడియాను ఉపయోగించుకుని యువతను తన వైపు ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఐఎస్ ఆదాయ మార్గాలను వెల్లడించిన అమెరికా, తాజాగా ఆ సంస్థ నకిలీ పాస్ పోర్టులను కూడా తయారు చేస్తోందని తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం తమ సభ్యులకు నకిలీ పాస్ పోర్టులు సైతం తయారు చేస్తోందని యూఎస్ 'ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇంటెలిజెన్స్' విభాగం వెల్లడించింది. సిరియాలోని ప్రభుత్వ భవనాలను తమ అధీనంలోకి తీసుకుని అక్కడ పౌరుల వివరాలను మొత్తం ఐఎస్ ఉగ్రవాదులు సేకరించారని చెప్పింది. పాస్ పోర్ట్ తయారీ యంత్రాలను, పాస్ పోర్ట్ బ్లాంక్ పుస్తకాలను కూడా సమకూర్చుకున్నారని, దాని ద్వారా సులభంగా పాస్ పోర్టులను తయారు చేసుకుంటున్నారని ఓ నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలో అటువంటి పాస్ పోర్టులతో ఇప్పటికే పలువురు అమెరికాలో ప్రవేశించి ఉంటారని ఎఫ్ బీఐ అనుమానిస్తోంది.

  • Loading...

More Telugu News