: భారత్ వేగంగా అభివృద్ధి చెందాలనుకుంటోంది: మోదీ


వేగంగా దూసుకెళ్లే రైళ్లలానే భారత్ కూడా వేగంగా అభివృద్ధి చెందాలనుకుంటోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన భారత్-జపాన్ వాణిజ్యవేత్తల సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్ లో మేకిన్ ఇండియా కార్యక్రమం 12 బిలియన్ డాలర్లతో ప్రారంభమైందని చెప్పారు. మేకిన్ ఇండియాకు జపాన్ ప్రభుత్వ సహకారం చాలా గొప్పదని కొనియాడారు. భద్రత, సహకారం దిశగా ఇరు దేశాలు మరో అడుగు వేశాయని తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి జపాన్ మద్దతు ఇచ్చిందని చెప్పారు. దేశ ప్రగతి కోసం జపాన్ మాదిరి మరే ఇతర దేశం నిర్ణయాత్మక పాత్ర పోషించలేదని అన్నారు.

  • Loading...

More Telugu News