: వారణాసి గంగా హారతిలో పాల్గొననున్న మోదీ-షింజో


భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని షింజో అబే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియోజకవర్గం వారణాసిలో ఇవాళ పర్యటించనున్నారు. ఈ సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో వారిద్దరూ వారణాసిలోని బబత్ పూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్ గేట్ వేకు వెళతారు. సాయంత్రం 5.45 నిమిషాలకు గంగా ఘాట్ కు చేరుకుంటారు. తరువాత పవిత్ర దశశ్వమేథ ఘాట్ లో జరిగే గంగా హారతిలో పాల్గొంటారు. ఈ వేడుక కోసం భారతీయ ఆర్మీ ఓ ప్రత్యేక వేదికను కూడా తయారు చేసింది.

  • Loading...

More Telugu News