: కాల్ మనీ కేసులో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారో చూడాలి: కొడాలి నాని
కృష్ణా జిల్లా విజయవాడ కాల్ మనీ కేసు దర్యాప్తులో ఎవరి ఒత్తిళ్లకు లొంగవద్దని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఈ కేసులో ఎంతటివారున్నా ఉపేక్షించవద్దని సీఎంకు సూచించారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఎదుటి వారికి నీతులు చెబుతారు కానీ, ఆయన మాత్రం పాటించరని విమర్శించారు. కాల్ మనీ వ్యవహారం సొంత పార్టీ నేతల వ్యవహారమని, దానిపై బాబు ఎలా వ్యవహరిస్తారో చూడాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న అధికార పార్టీ నేతలు ఇప్పుడేం సమాదానం చెబుతారని నిలదీశారు. టీడీపీ నేతలు పేదల రక్తపు కూడు తింటున్నారని నాని ఆరోపించారు.