: మోదీ ఆర్థిక విధానాలు జపాన్ హైస్పీడ్ రైలులా ఉన్నాయి: జపాన్ ప్రధాని
భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ఢిల్లీలో జరుగుతున్న భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సుకు హాజరయ్యారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీపై షింజో అబే ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ చేపట్టిన ఆర్థిక విధానాలు జపాన్ హైస్పీడ్ ట్రైన్ లా ఉన్నాయని కితాబిచ్చారు. ఈ సమావేశం సందర్భంగా పౌర అణు ఒప్పందంతో పాటు, తొలి బుల్లెట్ రైలు ట్రాక్ కోసం రూ. 98 వేల కోట్ల ఒప్పందం, వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టుల ఒప్పందం, స్మార్ట్ సిటీలకు సహకారం వంటి ఒప్పందాలు చేసుకున్నారు.