: బెజవాడ కోర్టులో తారా చౌదరి... మూడు సెక్షన్ల కింద కేసు నమోదు
హైదరాబాదులో సెక్స్ రాకెట్, ఆ తర్వాత దాడి కేసుతో కలకలం రేపిన తారా చౌదరి తాజాగా కొద్దిసేపటి క్రితం బెజవాడ కోర్టుకు వచ్చారు. సొంత వదిన కవితపై దాడి చేసిన ఘటనలో నిన్న సాయంత్రమే బెజవాడ పోలీసులు తారా చౌదరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఐపీసీ 332, 352, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కొద్దిసేపటి క్రితం ఆమెను విజయవాడలోని మొదటి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో తారా చౌదరికి బెయిల్ లభిస్తుందా? రిమాండ్ కు తరలిస్తారా? అన్న విషయం మరికాసేపట్లో తేలనుంది.