: కాల్ మనీ అప్పులు చెల్లించొద్దు.... బెజవాడ వాసులకు బొండా ఉమ పిలుపు
విజయవాడలో కోరలు చాస్తోన్న కాల్ మనీ వ్యాపారంపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ, రుణ వసూళ్లలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కాల్ మనీ వ్యాపారుల దారుణాలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఓ వార్తా చానెల్ తో మాట్లాడిన బొండా ఉమ, కాల్ మనీ అప్పులను చెల్లించవద్దని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. తీసుకున్న అప్పుల్లో చిల్లిగవ్వ కూడా చెల్లించవద్దని పేర్కొన్న ఆయన, కాల్ మనీ వ్యాపారుల బెదిరింపులకు ఏమాత్రం బెదరవద్దని కూడా ఆయన సూచించారు. కాల్ మనీ వ్యాపారుల పీచమణిచేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన ప్రకటించారు.