: ‘కల్తీ’ విచారణకు రండి... మల్లాది విష్ణు తల్లికి కృష్ణలంక పోలీసుల నోటీసులు


విజయవాడలో ఐదుగురు కూలీల ప్రాణాలను బలిగొన్న కల్తీ మద్యం ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కల్తీ మద్యం సరఫరా చేసిన కృష్ణలంకలోని స్వర్ణ బార్ యజమాని మల్లాది శ్రీనివాస్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు షాకిచ్చారు. వెనువెంటనే బార్ లో భాగస్వామ్యం ఉన్న మల్లాది విష్ణు తల్లి బాలత్రిపుర సుందరమ్మకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసులో విచారణ కోసం నేటి ఉదయం 10 గంటలకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు రావాలని ఆ నోటీసులలో పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆమె నేటి ఉదయం పోలీస్ స్టేషన్ కు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. దీనిపై నగరంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News