: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు...పోలీసులపై చిర్రుబుర్రులాడిన సంపన్న మహిళ


డ్రంకన్ డ్రైవింగ్ పై హైదరాబాదు నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిత్యం నగరంలో ఎక్కడో ఒక చోట వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు వీకెండ్స్ లో సంపన్నులుండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ను మాత్రం జల్లెడ పడుతున్నారు. నిన్న రాత్రి బంజారాహిల్స్ లో నిర్వహించిన తనిఖీలో 17 మంది మందుబాబులు ఫుల్లుగా తాగేసి వాహనాలు నడుపుతూ పోలీసులకు దొరికిపోయారు. ఈ సందర్భంగా పట్టుబడ్డ మందుబాబులపై కేసులు నమోదు చేసిన పోలీసులు 6 కార్లు, 9 బైకులను సీజ్ చేశారు. సోదాల్లో భాగంగా నిన్న కూడా పోలీసులకు మందుబాబులతో వాగ్వాదం తప్పలేదు. తన కారును ఆపి తననే తనిఖీ చేస్తారా? అంటూ ఓ సంపన్న మహిళ కారు దిగీ దిగగానే నేరుగా పోలీసుల వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగింది. పోలీసులు సర్దిచెప్పేందుకు యత్నించినా సదరు మహిళ వినలేదు. పోలీసులపై చిర్రుబుర్రులాడుతూ నోటికొచ్చినట్లు వాగేసింది.

  • Loading...

More Telugu News