: శ్రీవారిని దర్శించుకున్న రాజ్ నాథ్ సింగ్
కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్ నాథ్ వెంట ఏపీ మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు ఉన్నారు. అంతకుముందు ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న హోంమంత్రికి పలువురు బీజేపీ నేతలు కూడా పుష్పగుచ్ఛం, శాలువాతో స్వాగతం పలికారు.