: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఊరట... జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావుకు జైలు శిక్ష నుంచి ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు విధించిన నెల రోజుల జైలు శిక్ష, జరిమానాపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం గ్రామ పరిధిలోని అక్రమ నివాసితులను ఖాళీ చేయించాలని 2008లో హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేయనందున కలెక్టర్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని నెల రోజుల జైలు శిక్ష విధించింది. దానిపై ఆయన సుప్రీంకు వెళ్లడంతో తాజాగా ఊరట లభించింది.