: టీటీడీపీకి మరో షాక్... మాజీమంత్రి విజయరామారావు రాజీనామా
తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి విజయరామారావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కాసేపటి క్రితం ఆయన తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా టీడీపీ కార్యాలయానికి పంపారు. త్వరలోనే ఆయన గులాబీ గూటికి చేరనున్నారని విశ్వసనీయ సమాచారం. విజయరామారావు కూడా పార్టీకి గుడ్ బై చెప్పడంతో... తెలంగాణలో టీడీపీ మరింత బలహీనపడినట్టు అయింది. ఈ రాజీనామాపై పార్టీ శ్రేణులు ఇంకా స్పందించలేదు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మాజీ సీఎల్పీ నేత దివంగత పీజేఆర్ పై గెలిచి ఆయన మంత్రి పదవిని చేపట్టారు. సీబీఐ డైరెక్టర్ గా తన పదవీకాలం ముగిసిన అనంతరం ఆయన టీడీపీలో చేరారు.