: అభివృద్ధిని చూసి కాదు... భయపడి టీఆర్ఎస్ లో చేరుతున్నారు: నాగం


ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరుతున్న నేతలంతా బంగారు తెలంగాణ కోసం చేరడం లేదని... ప్రభుత్వానికి భయపడి చేరుతున్నారని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. మాయ మాటలు చెబుతూ కాలం గడుపుతున్న కేసీఆర్... ఇప్పటికైనా పాలనపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల హోర్డింగ్ లపై మంత్రుల ఫొటోలు కాకుండా, కారు గుర్తును వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని మంత్రులందరినీ పనికిరాని వారిగా తయారు చేశారని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News