: 'ఆపరేషన్ రోమియో'...ఈవ్ టీజర్లకు హర్యాణా పోలీస్ కొత్త ట్రీట్ మెంట్
ఈవ్ టీజర్లకు చెక్ పెట్టేందుకు హర్యాణా పోలీసులు 'ఆపరేషన్ రోమియో' చేపట్టారు. ఇందులో భాగంగా ఈవ్ టీజింగ్ కు పాల్పడిన వారి ఫోటోలను స్టేషన్ లో పెట్టడానికి బదులు సోషల్ మీడియాలో పెట్టనున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ ల వినియోగంలో యువత దూసుకుపోతుండడంతో, సోషల్ మీడియాను వేదిక చేసుకుంటే ఈవ్ టీజింగ్ ను అరికట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈరోజుల్లో సోషల్ మీడియాలో అకౌంట్ లేని యువకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఈవ్ టీజింగ్ ను అరికట్టాలంటే ఇదే సరైన మార్గంగా భావిస్తున్నారు. ఈ విధానాన్ని త్వరలో అమలులోకి తెస్తామని చెబుతున్నారు.