: ‘రోజు విడిచి రోజు’ నిబంధన ఉల్లంఘిస్తే రూ.2000 జరిమానా!


ఢిల్లీలో త్వరలో అమల్లోకి రానున్న బేసి- సరి సంఖ్య విధానాన్ని ఉల్లంఘించే ప్రైవేట్ వాహనాలకు రూ.2000 లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించనున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు ఈ జరిమానా విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి మోటార్ వెహికల్స్ యాక్టులోని ఒక ప్రొవిజన్ ను పొడిగించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అంగీకరించిందని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించే నేపథ్యంలో రోజు విడిచి రోజు విధానంలో ప్రైవేట్ వాహనాలను అనుమతించేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కారు నంబర్ చివరి సంఖ్య (బేసి లేదా సరి)ను ఆధారంగా చేసుకుని ఈ కొత్త విధానాన్ని రూపొందించారు.

  • Loading...

More Telugu News