: భారీ నష్టం జరిగింది... ఉదారంగా ఆదుకోండి: కేంద్ర బృందానికి చంద్రబాబు విజ్ఞప్తి


రాష్ట్రంలో సంభవించిన వరద నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో సమావేశమయ్యారు. భారీ వర్షాలు, వరదల వల్ల రూ. 3,759.97 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఈ సందర్భంగా చంద్రబాబు కేంద్ర బృందానికి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. వరద నష్టానికి సంబంధించి నివేదికను అందజేశారు. మరోవైపు, ఈ బృంద సభ్యులు ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి వరద నష్టాలను పరిశీలించారు.

  • Loading...

More Telugu News