: ‘నటసామ్రాట్’లో నానాపటేకర్ నటన అద్భుతం: అమితాబ్
'నటసామ్రాట్' అనే మరాఠీ చిత్రంలో నానాపటేకర్ నటన అద్భుతంగా ఉందని బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. ఇటీవల ఈ చిత్రాన్ని తాను చూశానని అమితాబ్ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. గొప్ప కథతో రూపొందించిన మరాఠీ డ్రామా ‘నటసామ్రాట్’ ఇన్నాళ్లు రంగస్థలంపై ప్రదర్శించారని... ఇప్పుడు వెండితెరపై కూడా చూడవచ్చని అన్నారు. మరాఠీ చిత్రాల స్థాయిని పెంచే విధంగా ఈ చిత్రం కథ ఉందన్నారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కొత్త ఏడాది జనవరి 1న విడుదల కానుంది. కాగా, ఇటీవల విడుదలైన నటసామ్రాట్ చిత్రం ట్రైలర్ కి మంచి స్పందన లభించింది.