: జియాఖాన్ కు అబార్షన్ చేసిన సూరజ్ పంచోలి... పిండాన్ని టాయిలెట్ లో పడేశాడట!


బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్ ఆత్మహత్యోదంతంలో ఆదిత్యా పంచోలీ కుమారుడు సూరజ్ పంచోలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జియాఖాన్ ఆత్మహత్య చేసుకోవడానికి పంచోలీనే కారణమంటూ సీబీఐ వాదిస్తోంది. ఈ మేరకు నేటి ఉదయం ముంబై సెషన్స్ కోర్టులో సీబీఐ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. సదరు చార్జిషీట్ లో పలు దిగ్భ్రాంతికర విషయాలున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పంచోలీ కారణంగా గర్భవతి అయిన జియాఖాన్, తాను నాలుగు వారాల గర్భిణీగా ఉన్నప్పుడు అతడికి విషయం చెప్పింది. ఈ క్రమంలో రెండు, మూడు సార్లు జియాఖాన్ ను పంచోలీ వైద్యుల వద్దకు తీసుకెళ్లాడు. గర్భ విచ్చిత్తికి ఓ గైనకాలజిస్ట్ స్ట్రాంగ్ డోస్ తో కూడిన మందులు ఇచ్చింది. అవి తీసుకున్న తర్వాత జియాఖాన్ కు తీవ్ర బాధతో కూడిన రక్తస్రావం జరిగింది. ఆ బాధ తాళలేక పలుమార్లు పంచోలీకి ఫోన్ చేసింది. దీంతో ఎక్కడ తమ బంధం బయటపడుతుందోనన్న భయంతో జియాఖాన్ కు అబార్షన్ చేయించడమే మేలని అతడు భావించాడు. ఈ క్రమంలో వైద్యులతో ఆ పని చేయించడం మరింత ప్రమాదకరమని భావించిన పంచోలీ తానే జియాఖాన్ గర్భాన్ని తొలగించాడు. ఆ తర్వాత పిండాన్ని అతడు టాయిలెట్ లో పడేశాడు.

  • Loading...

More Telugu News