: హైకోర్టు కల్పించుకోవడంతో, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీపై లైంగిక వేధింపుల కేసు
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జనార్దన్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దక్షిణ మధ్య రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దుర్గ అనే ఉద్యోగిని, తనను ఎస్పీ నిత్యమూ వేధిస్తున్నాడని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు జనార్దన్ పై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తనపై దుర్గ చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రమూ వాస్తవం లేదని ఎస్పీ అంటుండటం గమనార్హం. ఆమె తన కార్యాలయంలో గంట పాటు కూడా పనిచేయలేదని, తప్పుడు ధ్రువపత్రాలతో ఆమె ఉద్యోగంలో చేరిందని జనార్దన్ ఆరోపించారు. విద్యార్హతలను ప్రశ్నించిన మీదటే, తనపై తప్పుడు కేసు పెట్టారని, తాను విచారణకు సహకరించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెబుతున్నారు.