: ఎర్రబెల్లి పిటిషన్ ను నేడు విచారించనున్న సుప్రీంకోర్టు... సర్వత్రా ఆసక్తి


టీటీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. టీడీపీ నుంచి పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎర్రబెల్లి పిటిషన్ వేశారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ నేపథ్యంలో, అన్ని రాజకీయ పార్టీలు కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. టీడీపీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, మాధవరం కృష్ణారావు తదితరులు టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే!

  • Loading...

More Telugu News