: ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకున్న టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొన్ని చోట్ల ఏకగ్రీవమవుతున్నాయి. ఇప్పటికే వరంగల్ స్థానం టీఆర్ఎస్ అభ్యర్థి కొండా మురళికి దక్కగా, తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానం కూడా టీఆర్ఎస్ పరమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి పురాణం సతీష్ ఆ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడంతో ఎన్నిక ఇక ఏకగ్రీవమవుతోంది. విశేషం ఏమిటంటే, ఈ స్థానంలో పోటీ చేయాలనుకున్న టీడీపీ అభ్యర్థి నారాయణరెడ్డి తాజాగా టీఆర్ఎస్ లో చేరినట్టు వార్తలొస్తున్నాయి.