: నారా లోకేశ్ తో టీ-టీడీపీ నేతల భేటీ... ‘గ్రేటర్’ వ్యూహంపైనే చర్చ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో టీ-టీడీపీ కీలక నేతలు భేటీ అయ్యారు. హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరుగుతున్న ఈ భేటీలో టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావులు పాల్గొన్నారు. త్వరలో గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు జరగనున్న ఎన్నికపైనే సదరు భేటీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. రానున్న గ్రేటర్ ఎన్నికలతో పాటు ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపైనా వారు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు షాకిచ్చేలా ఫలితాలు రాబట్టేందుకు అవసరమైన పక్కా వ్యూహాల రచనపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.