: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో మరో అరెస్ట్


తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్యోదంతంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. హత్య జరిగిన మరుక్షణమే ఘటనలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న ముగ్గురు లొంగిపోగా, ఆ తర్వాత ఇటీవలే ప్రధాన నిందితుడు, కఠారి మోహన్ మేనల్లుడు చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ చిత్తూరు కోర్టులో లొంగిపోయాడు. మరోవైపు ఈ కేసుతో సంబంధం ఉందన్న కారణంగా 15 మంది చింటూ స్నేహితులు, రాజకీయ నేపథ్యమున్నవారు కూడా అరెస్టయ్యారు. తాజాగా నేటి ఉదయం చింటూ కారు డ్రైవర్ గా పనిచేసిన వెంకటేశ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 20కి చేరుకుంది. వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి రివాల్వర్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్రధాన నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతడి నుంచి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News