: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కుప్పం వైసీపీ నేతలు, కార్యకర్తలు
ప్రస్తుతం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. కుప్పంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్దకు వచ్చి ప్రజలు తమ వినతులను సీఎంకు అందజేశారు. తరువాత కుప్పం టీడీపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల నేతలు తమ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకమైందని, ఆ పార్టీ నేతల ఆలోచనా ధోరణి మారాలని కోరారు. ఏపీ అభివృద్ధిని కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్న సీఎం, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. కుప్పం నియోజకవర్గం తిరుగులేని శక్తిగా ఎదగాలని కోరారు.