: రోజుల చిన్నారికి అప్పుడే ఫిజిక్స్ పాఠాలు చెబుతున్న జుకర్ బర్గ్


ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్, ఇటీవల పుట్టిన తన బిడ్డ ప్రిసిల్లా చాన్ కు నెల నిండకముందే క్వాంటమ్ ఫిజిక్స్ పాఠాలు చెబుతున్నారు. బిడ్డ దగ్గర కూర్చుని ఫిజిక్స్ పుస్తకాలను తాను పెద్దగా చదువుతున్నానని చెబుతున్నారు. "ఈ ఏడు నా పుస్తకాల జాబితాలో 'క్వాంటమ్ ఫిజిక్స్ ఫర్ బేబీస్' అన్న పుస్తకం చేరింది, చిన్న చిన్న వాక్యాలు, బొమ్మలతో ఈ పుస్తకం ఉంటుంది" అని అంటున్నారు. ఇక వచ్చే ఏడు తన లైబ్రరీ అంతా చిన్నారుల పుస్తకాలతో నిండిపోతుందని ఆనందంగా చెప్పుకున్నారు. అంతేలే, ఎంతైనా తొలిసారిగా తండ్రయిన ఆనందం, తన కుమార్తె తనంత కావాలన్న ఆకాంక్ష ఉండటం సహజమే కదా? అయినా, అప్పుడే ఈ పాఠాలేంటి? అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.

  • Loading...

More Telugu News