: పొట్టి క్రికెట్ దే భవిష్యత్తు!... ఐపీఎల్ తరహాలో మరో లీగ్ కు బీసీసీఐ సన్నాహాలు


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ భవిష్యత్తునే మార్చేసింది. కేవలం భారత్ కే పరిమితమైన ఈ టీ20 సిరీస్ లో విదేశీ ఆటగాళ్లు పాలుపంచుకుంటున్నప్పటికీ దేశీయ ఫ్లేవర్ తోనే జరుగుతోంది. ఊహించని విధంగా విశ్వవ్యాప్తంగా ఈ టోర్నీకి జనాదరణ అమాంతం పెరిగిపోయింది. పలు దేశాలు ఈ టోర్నీని అనుసరిస్తూ టీ20కి మరింత ప్రాధాన్యం ఇస్తున్నాయి. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల నిష్క్రమణతో కొత్తగా పుణే, రాజ్ కోట్ జట్లు రంగప్రవేశం చేశాయి. ఈ జట్ల వేలం సందర్భంగా భారీ సంఖ్యలో కార్పొరేట్లు ఐపీఎల్ లో కాలు మోపేందుకు ఆసక్తి కనబరిచారు. రెండు జట్ల కోసం దాదాపు 20కి పైగా బిడ్లు దాఖలయ్యాయి. కార్పొరేట్లలోని ఉత్సాహాన్ని గమనించిన బీసీసీఐ... ఐపీఎల్ తరహాలోనే మరో టీ20 లీగ్ కు సన్నాహాలు చేస్తోంది. మరింత మంది కార్పొరేట్ దిగ్గజాలకు అవకాశం కల్పించే దిశగానే ఈ యోచన చేస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నిన్న న్యూఢిల్లీలో చెప్పారు.

  • Loading...

More Telugu News