: విశాఖ ఏజెన్సీలో ఎన్ కౌంటర్... ఇద్దరు మావోయిస్టుల హతం


విశాఖ జిల్లా ఏజెన్సీలో నేటి తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. నిషేధిత మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. జిల్లాలోని అరకు మండలం గన్నిల అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది. నిన్న రాత్రి ఏజెన్సీలో కూంబింగ్ కు వెళ్లిన పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మొదలైన కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News