: ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం: అనురాగ్ ఠాకూర్
భారత్, పాకిస్థాన్ సిరీస్ పై రోజురోజుకీ ఉత్కంఠ పెరుగుతోంది. ద్వైపాక్షిక సిరీస్ పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కాగా, గత నెలలో దుబాయ్ లో బీసీసీఐ, పీసీబీ నిర్వహించిన చర్చల సందర్భంగా డిసెంబర్ 15 నుంచి ద్వైపాక్షిక సిరీస్ శ్రీలంక వేదికగా జరుగుతుందని వార్తలు వెలువడ్డాయి. తరువాత కొద్ది రోజులకే బీసీసీఐ, పీసీబీ, పాకిస్థాన్ ప్రభుత్వం సిరీస్ నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. దీంతో పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు అనుమతించాలంటూ భారత ప్రభుత్వానికి బీసీసీఐ లేఖ రాసింది. దానిపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇదిలా వుంటే, భారత జట్టు ఆస్ట్రేలియా సిరీస్ కోసం జనవరి 5న బయల్దేరనుంది. వచ్చే నెల 12 నుంచి 31 వరకు అక్కడ పలు మ్యాచ్ లలో భారత్ ఆడనుంది.