: ఢిల్లీలో ఆరువేల అదనపు బస్సులు!


కొత్త ఏడాది జనవరి 1 నుంచి రోజు విడిచి రోజు పద్ధతిలో ప్రైవేట్ వాహనాలను ఢిల్లీలో రోడ్లపైకి అనుమతించనున్నారు. అదే రోజు నుంచి అదనపు ఆర్టీసీ బస్సులు ఢిల్లీ రోడ్లపై తిరగనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఆరువేల అదనపు బస్సులను త్వరలో ప్రవేశపెట్టేందుకు ‘కేజ్రీ’ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాది జనవరి 1-15 తేదీల మధ్య ఈ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. ఢిల్లీలో తిరిగే ఆటోల సంఖ్య కూడా రెట్టింపు కానుందన్నారు. ఒకే ఆటోను రెండు షిఫ్టులలో ఇద్దరు డ్రైవర్లు నడపే అవకాశముందన్నారు. కాగా, ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) ప్రతి రోజు సుమారు 4000 బస్సులను నడుపుతోంది. ఢిల్లీ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కల్గకుండా ఉండేందుకే మరిన్ని సిటీ బస్సులను ప్రవేశపెడుతున్నారు.

  • Loading...

More Telugu News