: ప్రొ రెజ్లింగ్ బెంగళూరు యోధాన్ జట్టును సొంతం చేసుకున్న కోహ్లీ


రోహిత్ శర్మ బాటలో విరాట్ కోహ్లీ నడిచాడు. ప్రొ రెజ్లింగ్ లీగ్ లో యూపీ జట్టును సహ యజమానిగా నిన్న రోహిత్ శర్మ కొనుగోలు చేయగా, ఈ రోజు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బెంగళూరు యోధాన్ జట్టుకు సహయజమాని అయ్యాడు. ఆరు జట్లు పోటీపడే ప్రొ రెజ్లింగ్ లీగ్ లో ఒక్కో జట్టులో తొమ్మిది మంది ఆటగాళ్లుంటారు. బెంగళూరు జట్టును సొంతం చేసుకున్న సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ, తనకు బెంగళూరు కొత్త కాదని, ఆ బంధం కొనసాగించేందుకే ప్రొ రెజ్లింగ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేశానని చెప్పాడు. కాగా, కోహ్లీ ఇండియన్ సూపర్ లీగ్ లో గోవా జట్టు సహయజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News