: సీఎం చంద్రబాబు రేపటి కడప పర్యటన రద్దు
కడపలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి రేపటి పర్యటన రద్దయింది. అయితే, ఈ పర్యటన రద్దుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. షెడ్యూలు ప్రకారం రేపు అక్కడ నిర్వహించనున్న జనచైతన్య యాత్రలో బాబు పాల్గొనాల్సి ఉంది. ముఖ్యమంత్రి పర్యటన రద్దవడంతో టీడీపీ శ్రేణులు కొంత నిరుత్సాహానికి గురయ్యాయి. కాగా, చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.