: ఉస్మానియా యూనివర్శిటీ సమీపంలో సిటీ బస్సుపై రాళ్ల దాడి!


ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంతంలో పట్టపగలే సిటీ బస్సుపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటన విద్యానగర్ లోని శివం రోడ్డులో జరిగింది. ఉప్పల్ నుంచి మెహిదీపట్నం వెళ్తున్న బస్సు శివం రోడ్డుకు చేరుకోగానే దుండగులు అకస్మాత్తుగా బస్సుపై రాళ్లు రువ్వారు. దీంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. బస్సు డ్రైవర్ వెంటనే స్పందించి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఉస్మానియా యూనివర్శిటీలో నేడు బీఫ్ ఫెస్టివల్ జరగాల్సి ఉంది. అయితే, ఈ ఫెస్టివల్ నిర్వహించడానికి అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని బస్సు ప్రయాణికులు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News