: చైనాలో నకిలీ ఫేస్ మాస్క్ లు స్వాధీనం!


చైనాలో నకిలీ ఫేస్ మాస్క్ లను అక్కడి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో సుమారు 1,20,000 నకిలీ ఫేస్ మాస్క్ లను గుర్తించారు. ఈ మాస్క్ లను యూఎస్ కు చెందిన 3ఎం సంస్థలోని ఒక విభాగం తయారు చేసినట్లు తెలుస్తోందని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. షాంఘైలోని కస్టమ్స్ ఏరియాలో చేపట్టిన తనిఖీలలో నకిలీ ఫేస్ మాస్క్ లను గుర్తించారు. ఈ నేపథ్యంలో పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, చైనా రాజధాని బీజింగ్ లో ఎయిర్ పొల్యూషన్ కారణంగా అక్కడ రెడ్ ఎలర్ట్ ప్రకటించారు. దీంతో అక్కడి ప్రజలు ఫేస్ మాస్క్ లు ధరించడం తప్పనిసరైంది.

  • Loading...

More Telugu News