: సల్మాన్ ఐదేళ్ల జైలుశిక్ష రద్దు, అన్ని అభియోగాలు కొట్టివేసిన న్యాయమూర్తి


2012 నాటి హిట్ అండ్ రన్ కేసు నుంచి సల్మాన్ బయటపడ్డాడు. ఈ కేసులో ఆయన్ను దోషిగా నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ చూపుతున్న ఆధారాలు సరిపోవని అభిప్రాయపడ్డ బాంబే హైకోర్టు, ట్రయల్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను రద్దు చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. సల్మాన్ పై నమోదైన అన్ని అభియోగాలనూ కొట్టేస్తున్నట్టు ప్రకటించింది. ఈ తీర్పు వెలువడే సమయంలో సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు కోర్టులోనే మౌనంగా కూర్చుని ఉన్నారు. కోర్టు బయట భారీ సంఖ్యలో చేరిన సల్మాన్ అభిమానులు తీర్పు తరువాత సంబరాలు జరుపుకున్నారు.

  • Loading...

More Telugu News