: ప్రత్యేక రాయలసీమకు కాంగ్రెస్ వ్యతిరేకం: రఘువీరా
ప్రత్యేక రాయలసీమ డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ సమస్యలపై మాత్రం అలుపెరుగని పోరాటం చేస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం పట్ల రాయలసీమ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని... రాయలసీమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే భావన ఏర్పడిందని చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ రఘువీరా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.