: స్వర్ణ బార్ లోనే మద్యం కల్తీ అయింది: ప్రాథమికంగా నిర్ధారించిన ఎక్సైజ్ కమిషనర్
కృష్ణాజిల్లా విజయవాడలోని కృష్ణలంక స్వర్ణబార్ లో మద్యం తాగి పలువురు పేదలు చనిపోయిన ఘటనలో రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఇవాళ సీఎం, ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. మిథైల్ ఆల్కహాల్ వల్లే మద్యం కల్తీ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. బార్ లోనే మద్యం కల్తీ జరిగినట్టు పేర్కొన్నారు. మిథైల్ ఆల్కహాల్ కలవడం వల్ల జీర్ణ వ్యవస్థ, కిడ్నీల్లో సమస్యలు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. సెల్లార్ లో బార్ నడపడం ఎక్సైజ్ వైఫల్యమేనని కమిషనర్ అంగీకరించారు. విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తో బాటు, బాధ్యులైన మరో ఇద్దరు అధికారులపై చర్యలకు కమిషనర్ సిఫారసు చేశారు.