: సంక్షేమం ఆగిపోవడం బాధను కలిగిస్తోంది: మోదీ
పేదల అభ్యున్నతికి, తద్వారా దేశాభివృద్ధికి ఉపయోగపడాల్సిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతిపాదనల రూపంలోనే ఆగిపోవడం బాధను కలిగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంటు సజావుగా సాగకపోవడం తనకు మనస్తాపాన్ని కలిగిస్తోందని ఈ ఉదయం ఆయన అన్నారు. కేవలం జీఎస్టీ బిల్లు మాత్రమే ఆగలేదని, పేదలకు సంబంధించిన ఎన్నో అంశాలు చర్చ, ఆమోదం లేకుండా మూలన పడ్డాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం స్తంభించడం దేశానికి మంచిది కాదని, ఈ విషయంలో విపక్షాలు ప్రభుత్వంతో సహకరించాలని ఆయన కోరారు.