: తెలంగాణలో డీజిల్, పెట్రోల్ లపై సెస్?


వాహనదారులపై భారం మోపే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. రవాణా సెస్ విధించే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. ఈ క్రమంలో, పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై లీటర్ కు ఒక రూపాయి వంతున సెస్ విధించే దిశగా చర్చలు సాగుతున్నాయి. తెలంగాణలోని రవాణా సదుపాయాలు, మౌలిక వసతుల నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నుంచి కూడా నిధులు తీసుకోవాలని సంకల్పించింది. దీనికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ తో కూడా చర్చలు జరిగాయి. వరల్డ్ బ్యాంక్ సలహా మేరకే పెట్రోలియం ఉత్పత్తులపై సెస్ విధించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

  • Loading...

More Telugu News